యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొల్లిపర మండలం వల్లభాపురం లో సోమవారం జరిగింది. వల్లభాపురం గ్రామానికి చెందిన మక్కె నవీన్ (21) బీటెక్ మొదటి ఏడాదిలోనే చదువు నిలిపి వేశాడు. సోమవారం కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి శ్రీనివాస రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్. రవీంద్రారెడ్డి తెలిపారు.