విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు షేక్ చాంద్ బాషా కుమార్తె పై అత్యాచారయత్నం జరగటం బాధాకరమని జనసేన నాయకులూ తెలిపారు. మానవ మృగం హాఫిజ్ మస్తాన్ చేతిలో అత్యాచారాయత్నానికి గురైన పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన ఆరు సంవత్సరాల చిన్నపిల్లను పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన నాయకులూ పరామర్శించడం జరిగింది. చిన్నపిల్ల తల్లిదండ్రులును షేక్ చాంద్ భాషను అన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. చాంద్ బాషా నేను వైసీపీ పార్టీ చెందిన వాడిని ఎమ్మెల్యే వెల్లంపల్లి గారికి నేను ఫోన్ చేసిన స్పందించలేదని, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని గడపగడపకి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు తో తిరిగానని, నా కష్టం తెలిసిన కనీసం స్పందించలేదని, తన ఆవేదనను జనసేన నాయకులతో వెలిబుచ్చారు.