ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలను భూ కుంభకోణం అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎలా తప్పుడు రాతలు రాస్తాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇది అసలు జర్నలిజమేనా అని రామోజీ, రాధాకృష్ణలను నిలదీశారు. ఇందులో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు, కోర్టు తీర్పు తరవాత తమది అయిన ఆస్తికి సంబంధించి మరో ప్రైవేటు వ్యక్తి లేదా సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకోవటంలో ఏం తప్పు ఉందో చెప్పాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యంతోపాటు, మాపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు.