ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 12:27 PM

మహిళా ఐఏఎస్‌ను అవమానించడం బాధాకరమని, జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంటనే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్‌ డిమాండ్‌ చేశారు. అనంతపురం కలెక్టరేట్‌లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రవర్తనపై మంత్రి ఉషాశ్రీచరణ్‌ మండిపడ్డారు. స్పందన కార్యక్రమం నేపథ్యంలో అర్జీ ఇవ్వడానికి కలెక్టరేట్‌కు వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించారని, ఆమెను అవమానించేలా మాట్లాడారన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమన్నారు. మీరు కలెక్టర్‌గా ఉండేందుకు అనర్హులు అని చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మికి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి ఉషాశ్రీ చరణ్‌ డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com