మినిమం సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్‌పీ) కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, అత్యంత పటిష్ట విధానంతో ధాన్యం సేకరణ కొనసాగాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌పై సమీక్షించిన అనంతరం మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.