విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023 లోగోను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్ షన్మోహన్, ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్ కె. రవిచంద్రారెడ్డి, పరిశ్రమలుశాఖ సలహాదారు ఎల్. శ్రీధర్, ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్ ఎస్. నీరజ్, ఏపీఐడీసీ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.