ప్రధాని తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈనెల 11న ఏపీలో పర్యటించి, 12న తెలంగాణకి రానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇవ్వనున్నారు. అయితే కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని, మోదీ వస్తే తాము అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు. మోదీ రామగుండం వస్తే అగ్నిగుండమేనని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.