రాజమండ్రి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విశాఖ నుండి రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ రైల్వే అదికారులు బుదవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో కొన్ని రైళ్లు రద్దు చెయ్యగా మరికొన్ని రైల్లు పాక్షికంగా రద్దు చేసారు. విశాఖ - విజయవాడ, గుంటూరు - విశాఖ మధ్యనడిచే సుమారు తొమ్మిది రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. అలాగే కాకినాడ - విజయవాడ , విజయవాడ - రాజమండ్రి మధ్యనడిచే రైళ్లను తాడిపల్లి గూడెం వరకు కుదించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం - లింగంపల్లి రైలు రెండు గంటలు అలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు.
మార్పులను గమనించి ప్రయాణికులు రైల్వే అధికారులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.