నవంబరు 9వ తేదీ వచ్చినా కూడా అక్టోబరు నెల జీతాలు రాక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు, గుంటూరు, నంద్యాల, కృష్ణా సహా మరికొన్ని జిల్లాల్లోని 40 శాతం మంది ఉద్యోగులకు జీతం పడలేదని సమాచారం. ఇలా ఐతే EMIలు, లోన్లు ఎలా కట్టుకోవాలని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. జీతాలు చెల్లించాలంటూ కొంతమంది ఆందోళనలూ చేపడుతున్నారు.