ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన విధుల్లో ఉన్న డ్రైనేజీ కాలువలలో చెత్త చెదరాలు నుండి అపరిశుభ్రంగా మారిపోయాయి. చెత్తాచెదారం వల్ల మురికి నీరు ఎటు వెళ్లకుండా అక్కడే ఉండి ఈగలు దోమలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ కాలువలో నిలువ ఉన్న చెత్తాచెదారాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లాలని కోరుతున్నారు.