మహిళపై లైంగిక దాడి చేసి, కులం పేరుతో దూషించిన వ్యక్తులపై మంగళవారం కేసు నమోదు అయింది. పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాలప్రకారం పల్నాడు జిల్లా నకరికల్లు గ్రామానికి చెందిన కనుమూరు శ్రీలత, చిన్ననాటి నుంచే విద్యానగర్ లోని కోవెలమూడి సాంబయ్య చౌదరి నివాసంలో పనిచేస్తోంది. ఈక్రమంలో ఆమె పెద్దయ్యాక వివాహం జరిపిస్తామని పనిలో పెట్టుకున్నారు. పెద్దయ్యాక ఆమెపై సాంబయ్య చౌదరి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతోపాటు సాంబయ్య చౌదరి భార్య కృష్ణ చైతన్య నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధింపులకు గురి చేశారు. దీంతోపాటు ఆమెను కులం పేరుతో దూషించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.