గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించడమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ఉద్దేశం అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బుధవారం రేపల్లె మండలం చిన్న ఆరవపల్లి పంచాయతీలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మోపిదేవి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఒక్కో కుటుంబానికి జరిగిన లబ్ధి గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.