విశాఖ, పెద్ద వాల్తేరులో షాపులు తొలగించడం దారుణమని బీజేపీ నాయకులూ జీవీఎల్ అన్నారు. బడా బాబులు ఆక్రమించుకున్నవాటిని కూడా అలాగే తొలగిస్తారా? అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగించడం సరికాదన్నారు. ప్రధాని సభ సందర్భంగా చెట్లను తొలగించినట్లు తెలిసిందని.. వాటి స్థానంలో లక్ష ముక్కలు నాటుతామన్నారు. కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాను తక్షణమే ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.