ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాపథకాలు నూరుశాతం విద్యార్థులకు చేరేలా చర్యలు చేపట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 03:38 PM

విద్యాశాఖలో అమలవుతున్న వివిధ పథకాల అమలుతీరుపై కాకినాడ  జిల్లాలోని ఎంఈవోలతో సమగ్రశిక్ష సమావేశమందిరంలో మంగళవారం డీఈవో అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఆర్జేడీ మధుసూదనరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న విద్యాపథకాలు నూరుశాతం విద్యార్థులకు చేరేలా చర్యలు చేపట్టాలని ఎంఈవోలను ఆదేశించారు. డీఈవో మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కార్యాలయానికి తెలపాలన్నారు. సమావేశంలో డీవైఈవో డేనియల్‌రాజు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com