గోవా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఏడాది పాటు ప్రైవేటు సంస్థలో పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొంది. అనుభవంలేని వాళ్లను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రైవేటులో అనుభవం రూల్ వల్ల నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్ఎస్ సీ ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ రూల్ ను తప్పనిసరి చేస్తామని తెలిపారు.