T20 WCలో అద్భుత ఫామ్‌తో చెలరేగిపోతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే గురువారం ఇంగ్లాండ్‌తో సెమీస్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను కోహ్లీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దానికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ ఓ అభ్యర్థన చేశాడు. "నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీక్కూడా తెలుసు. కానీ రేపు ఒక్కరోజు విశ్రాంతి తీసుకో ప్లీజ్’’ అని సరదాగా రాసుకొచ్చాడు.