చాలా మంది కుక్కలను పెంచుకుంటుంటారు. దీనిని తప్పు పట్టలేం. అయితే సమాజంలో కుక్కలను పెంచుకునే వారు వాటిని నియంత్రించడం కూడా తెలుసుకోవాలి. లేకుంటే ఇతరులు వాటి బారిన పడి గాయాల పాలవుతారు. తాజాగా గ్రేటర్ నోయిడాలోని యూనిటెక్ హారిజన్ సెక్టార్ పై-2లో ఓ కుక్క బుధవారం సెక్యూరిటీ గార్డును కరిచింది. దానిని పెంచుకుంటున్న మహిళ సమక్షంలోనే ఇది జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కుక్కను పెంచుకుంటున్న మహిళపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa