బ్రిటన్ రాజు చార్లెస్ 3 పై ఓ వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. యార్క్ నగరంలో ఓ సంప్రదాయ వేడుకకు రాజు తన భార్య కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన వారితో రాజు కరచాలనం చేస్తుండగా జన సమూహంలోని ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనపైకి మూడు గుడ్లు విసిరాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa