బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. నవాడా జిల్లాలో విషంతాగి ఒకే కుటుంబానికి చెంగిన ఐదుగురు మృతి చెందారు. మొత్తం ఆరుగురు ఆత్మహత్యకు యత్నించగా, ఒక చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యలకు కారణమని సమాచారం. ఈ కుటుంబం చెల్లించాల్సిన ఒక లోన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని నవాడా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగ్లా వెల్లడించారు.