జిడిసిసి బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ఉద్యోగుల చేతివాటం పెరుగుతోంది. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందిన వ్యవహారం ఇంకా కొలిక్కరాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కుంభకోణంలో రూ. 10. 95 కోట్లు అక్రమంగా రుణాలు పొందినట్లు బుధవారం గుర్తించారు. ఈ వ్యవహారంలో వివిధ సహకార సంఘాల్లోని 12 మందిని సస్పెండ్ చేశారు. ఇదే రీతిలో డిసిసిబి లోనూ నలుగురు కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేశారు.