ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించింది. ఆధార్ కు బయోమెట్రిక్ నమోదు ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆధార్ మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.