ఏపీలోని ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మంచి వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు.