పూనెలోని వాన్‌వాడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శివర్కర్ స్లమ్ ప్రాంతంలో గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో టిన్ తో చేసిన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ అవ్వలేదని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa