అఫ్ఘనిస్తాన్ దేశంలో జిమ్ లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. తాలిబన్ ప్రతినిధి మహ్మద్ అకేబ్ మొహెజెర్ మాట్లాడుతూ గత 15 నెలలుగా పార్కులు, జిమ్ లకు మహిళల ప్రవేశాన్ని నిషేధించకుండా ఉండేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. కొన్ని రోజులు మహిళలకు కొన్ని రోజులు పురుషులకు ప్రవేశం కల్పించామని, దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.