ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి గురువారం పోలీస్ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధుల గురించి తెలియజేశారు. వీవీఐపీలు, వీఐపీలు సంచరించే హెలి ఫ్యాడ్, సభా ప్రాంగణం, రహదారి వెంబడి బందోబస్తు విధులు కేటాయించిన సిబ్బంది అప్రమతంగా ఉండాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.