శబరిమల పరిసర ప్రాంతాల్లో మద్యం, మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగాలపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. 2 నెలల పాటు కొనసాగే మండలం- మకరవిలక్కు ఉత్సవాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం కచ్చితంగా అమలు చేయాలని పోలీసులు, ఎక్సైజ్, అటవీశాఖ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం ప్రారంభం కానుంది.