చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించి, జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అవసరమైన అభి వృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో చిత్తూరు నగర అభివృద్ధికి సం బంధించి జిల్లా కలె క్టర్ చిత్తూరు శాస న సభ్యులు ఆరణి శ్రీనివాసులతో కలిసి మునిసిపల్ కమి షనర్అరుణ, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నియోజక వర్గ అభివృద్ధిపై ఇటీ వల రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షసమావేశంలో పలు నివేదికలను సమర్పించడం జరిగిందని ఇందులో భాగంగా , ప్రధానంగా నగర పాలక పరిధి లో డ్రైనేజీ వ్యవస్థలు చక్కదిద్దెందుకుపలు కాలనీలు, ప్రధాన కూ డళ్లలో నూతన డ్రైనేజీలను నిర్మించడం పాడైన వాటిని మర మ్మత్తుల చేయడం తద్వారా వర్షాలు కురిసినప్పుడు నిమి షాల్లోనే వర్షపు నీరు వెళ్లిపోయేలా. మరియు పారిశుద్ధ్య నిర్వ హణకు అధిక ప్రాధా న్యత ఇస్తున్నామ న్నారు.