టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన ఘటనపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసి బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని అన్నారు. తమ ఎమ్మెల్యేలను కూడా కొనేందుకు కుట్ర జరుగుతోందని, ఒక్కొక్కరికి 25 కోట్లు ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. దీనిని తెలంగాణ ఘటనే సాక్ష్యమని అన్నారు. 41 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొడతామని నిందితులు చెప్పారవి కేజ్రీవాల్ తెలిపారు.