ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు. నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ ఆందోళన చేపట్టారు. నల్లదుస్తులు ధరించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయమని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ను వెంటనే ప్రకటించాలని రామకృష్ణ అన్నారు.