రాష్ట్రంలో వామపక్షపార్టీల ఐక్యతకు ఢోకాలేదు. అసలు కమ్యూనిస్టుపార్టీలన్నీ కలిసి పనిచేయడానికి కృషి చేస్తున్నదే మేము. సీపీఎం బలంగా లేని చోట వామపక్ష ఐక్యత బలంగా లేదు. మేం చొరవ తీసుకుంటున్నాం. కలిసి పనిచేద్దాం అంటున్నాం. కానీ మిగిలిన వాళ్లు కలిసి పోదాం అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నిచారు.రాజమహేంద్రవరం వైఎంవీఏ హాలులో గురువారం జరిగిన సీపీఎం రాజకీయశిక్షణ తరగతుల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనసేన, టీడీపీలు అన్ని పార్టీలను కలుపుకుని పోవాలి. కానీ వీళ్లిద్దరూ బీజేపీని కలుపుకుని పోతున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని కలుపుకుని పోయి మీరేం సాధిస్తారన్నారు. మీరు బీజేపీతో కలసి ఉంటూ అన్ని పార్టీలను కలుపుకుని రాష్ట్రాన్ని ఉద్దరిస్తామంటే రాష్ట్రం విధ్వంసం జరుగుతుందన్నారు. మోదీ దగా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకుని నిలబడుతోంది. ఇది వైసీపీ ప్రభుత్వానికి సిగ్గనిపించడంలేదా అని ప్రశ్నించారు.