మైక్సోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తన భార్య మిలిందాకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆయనతో విడిపోయిన తర్వాత మనోవేదనకు గురయ్యానంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ప్రస్తుతం 58 ఏళ్ల మిలిందా 60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ లో ఉందనే వార్త వైరల్ అవుతోంది. వీరద్దరూ కలిసి ఇప్పటికే పలుమార్లు మీడియా కంటికి చిక్కారు. ఈ వార్తలపై మిలిందా కానీ, జాన్ డ్యూ ప్రీ కానీ ఇంతవరకు స్పందించలేదు.