గ్రంధాలయాలు మానవుని మేధస్సు పెంపొందించే విజ్ఞాన భాండాగారా లని ఆర్డీఓ కె. రవీంద్ర అన్నారు. శుక్ర వారం గుంతకల్లు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రచార పోస్టర్లను ఆర్డీఓ కె. రవీంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తప్పని సరిగా గ్రంధాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న పుస్తకాలను పఠనం చేయాల న్నారు. గ్రంధాలయాలు విజ్ఞాన భాం డాగారాలని అన్నారు. గ్రంథాలయ అధికారి పి. కమ్మన్న మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుండి 20 తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వారోత్స వాలలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం, క్విజ్ వంటి పోటీలు నిర్వహింస్తామన్నారు. కావున ఈ వారోత్సవాలను ప్రజలు జయ ప్రదం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో గ్రంథాలయ సిబ్బంది రాము, క్రిష్ణవేణి పాల్గొన్నారు.