ఏపీ ప్రభుత్వం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోకి చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గణపవరం మండలాన్ని ఏలూరు రెవెన్యూ డివిజన్ నుంచి భీమవరం రెవెన్యూ డివిజన్ లోకి మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే 20 రోజుల్లోపు కలెక్టర్ కు సమర్పించాలని రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సాయిప్రసాద్ సూచించారు.