హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "హిమాచల్ ప్రదేశ్ లోని అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొని ఓటింగ్లో సరికొత్త రికార్డు సృష్టించాలని కోరుతున్నాను. తొలిసారిగా ఓటు వేయబోతున్న రాష్ట్ర యువతకు నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు.