వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఇస్తున్న ప్రాధాన్యంతో నేడు విశాఖపట్నం ప్రపంచపటంలో ప్రముఖ స్థానం సంపాదించడానికి సిద్ధమవుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అనేక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన కారణంగా వైజాగ్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగిందన్నారు.