మూడున్నరేళ్ళలో మైనార్టీ సంక్షేమం కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 20,330.43 కోట్లు ఖర్చు చేశారని డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌బాషా తెలిపారు. గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ..... 2019 నుంచి మైనార్టీలకు సువర్ణ అధ్యాయం, గత టీడీపీ పాలనలో మైనార్టీ సంక్షేమం కోసం కేవలం ఖర్చుచేసింది రూ. 2,665 కోట్లు మాత్రమే, కానీ ఈ ప్రభుత్వం మూడున్నరేళ్ళలో మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు చేసింది రూ. 20,330.43 కోట్లు, దీని ద్వారా 60,54,839 మైనార్టీలకు వివిధ పథకాల ద్వారా లబ్ది జరిగింది. రాష్ట్రంలో ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ భృతిని గత ప్రభుత్వం పక్కనపెడితే మా ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించడమేకాక పెంచిన గౌరవ భృతిని చెల్లిస్తుంది. మైనార్టీ వర్గాల రాజకీయ సాధికారత కల్పించిన ప్రభుత్వం ఇది అని అన్నారు.