కేంద్రం ఏమిచ్చింది.. పాచిపోయిన లడ్డు అన్న పవన్ కల్యాణ్ మాటలు జనం మర్చిపోలేదని మాజీ మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో విభజన హామీలు నెరవేరుతాయని ఆశిస్తున్నానని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు పొత్తులున్న పార్టీ నాయకులు కలవడంలో ప్రాధాన్యత ఏముందని ప్రశ్నిస్తూ.. ప్రధానితో పవన్ భేటీకి ఏ మాత్రం కూడా ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పారు. మూడేళ్లలో ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కోసం సీఎం వైయస్ జగన్.. ప్రధానిని నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారని కన్నబాబు గుర్తు చేశారు.