దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విశాఖలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడుతూ 'ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఒకవైపు రైల్వే స్టేషన్, మరోవైపు పోర్టు ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. విశాఖలో రైల్వేల అభివృద్ధితో పాటు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి జరగనుంది. మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ అనేది ప్రతి నగరానికి చాలా అవసరం' అని అన్నారు.