మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. పోషకాలు లేని ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవ్వక తప్పదు. రాత్రి భోజనంలో వివిధ పదార్థాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనంలో ముఖ్యంగా పెరుగు, ఫ్రై చేసిన ఆహారం, రెడ్ మీట్, పండ్లు, చిప్స్ లేకుండా చూస్కోవాలని నిపుణులు అంటున్నారు. అలాగే నిద్రపోయే మూడు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు.