ఎంత కాలం గడిచినా ఎంతమంది పాలకులు మారినా నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడైనా చందంగా మారిపోయింది. ఈ క్రమంలో కావలి నుంచి సీతారామపురం వరకు ఉదయగిరి మీదుగా జాతీయ రహదారి మంజూరు కావటంతో ఆ జాతీయ రహదారి కూడా గ్రామం బయట నుంచి వెళ్ళిపోతుందని తెలియడంతోఉదయగిరి పట్టణ ప్రజలు వ్యాపారస్తులు ఆందోళన చెందారు. అనూహ్యంగా ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి జాతీయ రహదారి ఉదయగిరి పట్టణంలో ప్రధాన రహదారిగా వెళుతుందని ప్రకటించడంతో గ్రామస్తులు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఉదయగిరి అంటేనే మారుమూల ప్రాంతం అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు లేని ప్రదేశం ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ రహదారి ఊరి బయట నుంచి వెళ్ళిపోతే ప్రైవేటు వ్యక్తుల భూములకు విలువ పెరగటం తప్ప మరి ఎలాంటి ప్రయోజనం ఉండదు. జాతీయ రహదారి వెలుపల నుంచి వెళ్లిపోవడంతో వాహనాల రాకపోకలు గ్రామం బయటనుంచి జరిగిపోతాయి. ఫలితంగా ఉదయగిరి పట్టణం మరింత వెనుక బాటుతనానికి గురవుతుంది
అదే జాతీయ రహదారి గ్రామంలో నుంచి వెళితే వ్యాపారాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది. నిరంతరం వాహనాల రాకపోకలు సాగుతూ ఉండటం వల్ల ఉదయగిరి నూతన కళను సంతరించుకుంటుంది. ముందు చూపుగా మేకపాటి చేసిన ప్రతిపాదనకు వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఆ రోడ్డు వెడల్పు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని వెంటనే రోడ్డు వెడల్పు కార్యక్రమం ప్రారంభించిననా తమకు నష్టం లేదని, జాతీయ రహదారిని గ్రామములోంచి తీసుకువెళ్లాలని శాసనసభ్యునికి మద్దతు తెలియజేశారు. జాతీయ రహదారి గ్రామంలో నుంచి వెళితే ఉదయగిరి పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఉదయగిరి ప్రాంత ప్రజలుఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిని పట్టణంలోంచి తీసుకెళ్లాలని కోరుతున్నారు.