గూడూరు లోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోకల్ లోకాదాలత్ నిర్వహించారు. కోర్టు ప్రాంగణంలో అధిక సంఖ్యలో కక్షిదారులు హాజరయ్యారు. రాజీమార్గంతో ఇరు వర్గాలకు అనుకూలంగా న్యాయవాదులు తీర్పు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు జడ్జ్ షమ్మి పర్వీన్ సుల్తానా బేగం, సీనియర్ ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జి అశోక్ కుమార్, అడిషనల్ జ్యుషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లోకనాథం, గూడూరు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పెంచలయ్య, అరవ పార్వతయ్య, మహబూబ్ బాషా, భాస్కర్, నాగేశ్వరమ్మ, కొండలరావు, రామసుబ్బయ్య, రజినీకాంత్ రెడ్డి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.