చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తంపేటలో భర్తను భార్య చంపడం కలకలం రేపింది. వెల్డింగ్ పని చేసుకుని జీవనం కొనసాగించే సత్తార్ ను భార్య కర్రతో కొట్టి చంపింది. సత్తార్ మద్యానికి బానిసవ్వటం, కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తుంది. వీరికి పెళ్లై 15 సంవత్సరాలవ్వగా అబ్బాయి అమ్మాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు