రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు..ఉండదు.. ఉండబోదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం విశాఖ నగరంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. విశాఖ పర్యటనలో మోడీ 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన, 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మొత్తం 10,742 కోట్ల ప్రాజెక్టులు ఏపీకి కేటాయించింది కేంద్రం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.