వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పొన్నూరు మండల పరిధిలోని మునిపల్లె గ్రామంలో గత రెండు రోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా మహిళా మణుల హారతుల తో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కిలారి కి ఘన సత్కారంలతో ఆహ్వానం పలికారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రెండు సిసి రోడ్ల ను ఆయన ప్రారంభోత్సవము చేశారు. సంక్షేమ పథకాల బుక్ లెట్స్ ను అందిస్తూ జగనన్న సుపరిపాలన గురించి అందరికీ వివరించుకుంటూ ఆయన ముందుకు సాగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు సంక్షేమ పథకాలతో ప్రజలందరి మన్ననలను పొందుతూ జగనన్న సుపరిపాలన, అత్యుత్తమ పాలన అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్య , వ్యవసాయ రంగాలను ప్రత్యేక శ్రద్ధతో వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశం లోనే ఏ రాష్ట్రం చేయని విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా అందరి దృష్టిని సైతం ఆకర్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు . ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో 98% అమలుపరిచి చూపిన ఏకైక ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.
రానున్న కాలంలో ఎన్నికల్లో 175 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించేదిశగా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రతి సచివాలయానికి 20 లక్షల ద్వారా ఆ సచివాలయ పరిధిలోని మౌలిక, అభివృద్ధి వసతులకు ఉపయోగపడే విధంగా తోడ్పాటునందించే జగనన్న ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషమాంబ, గ్రామ సర్పంచ్ స్వరూపారాణి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ, డైరెక్టర్ దాసరి నారాయణరావు, జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండల డైరెక్టర్ బొద్దులూరి రంగారావు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు రూరల్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.