ఢిల్లీలో శ్వేత అనే యువతి సఫ్లర్జంగ్ ఆసుపత్రి నుంచి ఓ మగబిడ్డను ఎత్తుకెళ్లింది. పోలీసులు మొబైల్ ట్రేస్ టెక్నాలజీ, సీసీ కెమెరాల సాయంతో ఆ యువతిని పట్టుకున్నారు. అయితే అనారోగ్యంతో చనిపోయిన తన తండ్రిని బ్రతికించేందుకు ఆ పసికందును శ్వేత ఎత్తుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఓ మగబిడ్డను బలి ఇస్తే తన తండ్రి బ్రతుకుతాడని మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మిన శ్వేత, క్షుద్రపూజల కోసం ఇలా చేసింది.