గుమ్మడి గింజలు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచి, టైప్ 2 డయాబెటిస్ రాకుండా కాపాడతాయి. వీటిలో ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ గింజలను తింటే నిద్రలేమి సమస్య పోతుంది. వీటిలో ప్రొటీన్లు, అధిక కెలోరీలు ఉంటాయి. వీటిలోని పీచు జీర్ణశక్తిని మెరుగురుస్తుంది. వీటిలో ఉండే జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.