దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 76 పాయింట్ల స్వల్ప లాభంతో 61781 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 18387 వద్ద కొనసాగుతున్నాయి. రూపాయి మారకం విలువ భారీగా పుంజుకొని రూ.80.80 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్ర, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్ర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.