జుట్టు సమస్యలు ఇటీవల సర్వసాధారణమయ్యాయి. జుట్టుకు తరచూ రంగు వేయడం(బ్లీచింగ్) పల్చబడటానికి ప్రధాన కారణం. జుట్టును వేడి నీటితో కడగడం వల్ల దానిపై ఒత్తిడి పెరిగి పల్చబడుతుంది. భోజనం మానేయడం వల్ల వచ్చే ప్రధాన హానికరమైన ప్రభావాలలో జుట్టు రాలడం ఒకటి. సూర్యరశ్మి అతిగా తాకడం వల్ల జుట్టు పల్చబడడం, చిట్లిపోవడం, పొడి బారడం జరుగుతుంది. జుట్టు పలచబడకుండా ఉండాలంటే ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.