గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ప్రభుత్వ నూతనంగా నిర్మించిన టీడ్కో, జగనన్న కాలనీలను ఆదివారం జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తమ అధినేత పవన్ కళ్యాణ్ పై, జనసేన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం వల్ల తాము భయపడి వెనక్కి తగ్గబోమన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన టీడ్కో గృహాలను రంగులు మార్చి ప్రజాధనం వృధా చేసి తానే అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకోవడం దారుణం అన్నారు.
కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యారని ఆరోపించారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జగనన్న కాలనీలో జగనన్న మోసం అనే పేరు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ, మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.