పేసర్ షాహీన్ అఫ్రిది గాయం ప్రపంచకప్ ఫైనల్ ఫలితాన్ని మార్చివేసిందని బాబర్ ఆజం అన్నాడు. మరికొందరు కూడా ఇదే కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే దీనికి సునీల్ గవాస్కర్ అంగీకరించలేదు. పాక్ జట్టు కనీసం 15-20 పరుగులు తక్కువగా ఉందని, 150కి పైగా స్కోర్ చేస్తే బౌలర్లు ఏమైనా చేసి ఉండేవారని అన్నాడు. ''పాక్ చేసిన స్కోరు పెద్దది కాదు. కనీసం 15-20 పరుగులు వెనుకబడి ఉంది. కాబట్టి షాహీన్ 10 బంతులు వేసి ఉంటే ఫలితం మారి ఉండేదని చెప్పడం సరికాదు అని స్పష్టం చేశాడు. షహీన్ తన కోటా పూర్తి చేసి ఉంటే మహా అయితే మరో వికెట్ తీసుకునే వాడని, అంతేకానీ ఇంగ్లండ్ విజయాన్ని అడ్డుకోలేడని సన్నీ చెప్పాడు. పాక్ బ్యాటింగ్ కనుక మరికొంత స్కోరు చేసి ఉంటే అప్పుడు గెలిచే అవకాశం ఉండేదన్నాడు.